కుక్కపిల్లకు అన్నీ తానై.. వానరం సపర్యలు - తమిళనాడు వార్తలు
🎬 Watch Now: Feature Video
తమిళనాడులోని కడలూరు పట్టణంలో ఒక కోతి తన జాతి ధర్మాన్ని మరచి కుక్కపిల్లని ఎత్తుకుని తిరుగుతుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాన్ని చేతుల్లో పట్టుకొని.. గుండెకు హత్తుకొని బిడ్డలా చూసుకుంటోంది ఓ వానరం. గత 10 రోజులుగా ఆ కుక్కపిల్ల పట్ల అమితమైన ప్రేమను చూపిస్తూ అక్కున చేర్చుకుంటోంది. ఈ రెండింటినీ విడదీసేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వీటికి ఆహారం అందిస్తున్నారు. ఇలాంటి వింత ప్రేమను తామెప్పుడూ చూడలేదని చెబుతున్నారు. జాతి వైరాన్ని విస్మరించి కుక్కపిల్లపై వానరం చూపే తల్లిప్రేమ చూడముచ్చటగా ఉందంటున్నారు.