3 కిమీ మేర స్తంభించిన ట్రాఫిక్- వాహనదారుల ఇక్కట్లు - యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్ జామ్
🎬 Watch Now: Feature Video

ఉత్తర్‌ప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్ వేపై ఆదివారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ (Yamuna Expressway Traffic Jam) స్తంభించింది. మథురాలోని టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడు కిలోమీటర్ల వరకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సాధారణంగా రోజుకు సగటున 10వేల నుంచి 15వేల వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు జరుపుతాయని.. కానీ ఆదివారం ఒక్కరోజే 50వేలకుపైగా వాహనాలు తిరిగినట్లు అధికారులు వెల్లడించారు. దీపావళి సెలవులు పూర్తికావడం, ఉద్యోగులు అందరూ తిరుగు ప్రయాణం పట్టడమే ఈ ట్రాఫిక్‌కు కారణమని పేర్కొన్నారు.