దొంగతనం చేసి.. గాల్లో వేలాడుతూ దొరికిపోయి... - రాజస్థాన్లోని జయపుర్లో దొంగతనం
🎬 Watch Now: Feature Video
తేలుకుట్టిన దొంగ అనే సామెత వినే ఉంటారు. అలాంటి ఘటనే రాజస్థాన్లోని జయపుర్లో జరిగింది. ఓ షాపులో దొంగతనానికి వెళ్లిన దొంగ.. కిటికీ నుంచి బయటకు రాబోయాడు. అయితే భవనం ఎత్తులో ఉండడం వల్ల అంత పైనుంచి రాలేక మధ్యలో ఇరుక్కుపోయాడు. ఓ పక్క భయం వేస్తున్నా కిక్కురుమనలేదు. అటువైపు వచ్చిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అతడ్ని సురక్షితంగా దింపి.. అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.