కొడుకును చిత్రహింసలు పెట్టి.. సెల్ఫీ వీడియో తీసి... - కొడుకుని కొట్టిన తల్లి
🎬 Watch Now: Feature Video
భర్తపై ఉన్న కోపాన్ని కొడుకుపై చూపించింది ఓ కర్కశ తల్లి. చిన్నారి రెండు చేతులను వెనక్కి కట్టేసి.. నోటి మీద పదే పదే కొట్టింది. బాలుడు నోటి నుంచి రక్తం దారలు కడుతుంటే చూసి రాక్షసానందాన్ని పొందింది. చిన్నారి వెక్కి వెక్కి ఏడుస్తున్నా.. వదలకుండా అత్యంత దారుణంగా కొట్టింది. సరిగ్గా నాలుగేళ్లు కూడా లేని ఆ బుడతడిని చిత్రహింసలకు గురిచేసింది. ఈ ఘోరాన్ని స్వయంగా సెల్ఫీ వీడియో తీయడం గమనార్హం. ఈ దారుణ ఘటన తమిళనాడులోని విల్లుపురంలో ఫిబ్రవరి 23వ తేదీన జరిగింది. ఈ ఘటనపై చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన తమిళనాడు పోలీసులు ఆమె స్వస్థలమైన చిత్తూరులో అరెస్ట్ చేశారు. కాగా చిన్నారిని కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తాజాగా వైరల్ అయ్యాయి.
Last Updated : Aug 29, 2021, 10:42 PM IST