బస్సులో ఒక్కసారిగా మంటలు- డ్రైవర్ చాకచక్యంతో ఆ 30 మంది... - bus fire news today
🎬 Watch Now: Feature Video
డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. 30 మంది ప్రయాణికుల ప్రాణాలు దక్కాయి. మహారాష్ట్రలోని పింప్రీ- చించ్వడ్ రహదారిపై ఉదయం 11 గంటల సమయంలో ఓ బస్సు పుణె వైపు వెళ్తుండగా.. ఒక్కసారిగా ఇంజిన్ నుంచి పొగ రావడం గమనించాడు డ్రైవర్. వెంటనే బస్సును నిలిపివేసి.. ప్రయాణికుల్ని దించేశాడు. క్షణాల్లోనే అగ్నికీలలు వ్యాపించగా.. బస్సు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు.