వైరల్: కరోనా సాంగ్లో పోలీసుల స్టెప్పులు అదుర్స్ - కేరళ పోలీసుల వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video
కరోనా వేళ.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేరళ పోలీసులు చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. కరోనా 2.0పై ప్రజలను అప్రమత్తం చేస్తూ.. మాస్కులు, శానిటైజర్, భౌతిక దూరం ప్రాధాన్యత తెలియజేసేలా ఈ వీడియోను రూపొందించారు. ఇందుకు మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న 'ఎంజాయ్ ఎంజామీ' పాటను ఎంచుకున్నారు. పాటకు తగ్గట్టు లిరిక్స్‌లో మార్పులు చేసిన పోలీసులు.. తమదైన శైలిలో స్టెప్పులేసి ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం.. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీత ఆదరణను చూరగొంది.