మంత్రిని మోసుకుంటూ వెళ్లిన జనం - తమిళనాడు మంత్రి అనితా రాధాకృష్ణన్ వార్తలు
🎬 Watch Now: Feature Video
కాళ్లకు ధరించిన బూట్లు నీటిలో తడుస్తాయని పడవ దిగేందుకు వెనకాడిన ఓ మంత్రిని స్థానిక మత్స్యకారులు ఒడ్డుకు మోసుకెళ్లారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. అధికార డీఎంకే పార్టీకి చెందిన మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్.. సముద్రపు కోతను పరిశీలించేందుకు పాలవర్కడులో పర్యటించారు. కాసేపు సముద్రంలో పడవపై ప్రయాణించిన మంత్రి.. బోటు తీరానికి చేరగా దిగేందుకు మత్స్యకారులు ఒక కుర్చీ వేశారు. అయితే పడవ ఒడ్డుకు కాస్త దూరంలో నిలవగా.. తన కాలి బూట్లు నీటిలో తడుస్తాయని భావించిన అనితా రాధాకృష్ణన్ పడవ దిగేందుకు వెనకాడారు. మంత్రి ఆలోచనను గ్రహించిన మత్స్యకారులు ఆయనను తమ చేతులపై మోసి ఒడ్డుకు చేర్చారు. మంత్రిని మత్స్యకారులు మోసుకెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మంత్రి ఈ విధంగా చేయడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు.