రోగిని బెడ్‌షీట్‌తో లాక్కెళ్లిన ఆసుపత్రి సిబ్బంది - patient
🎬 Watch Now: Feature Video
చికిత్స కోసం వచ్చిన ఓ రోగిని ఎక్స్ రే రూమ్‌లోకి స్ట్రెచర్‌పై కాకుండా నేలపై బెడ్ షీట్‌తో లాక్కెళ్లారు ఆసుపత్రి సిబ్బంది. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్ జబల్‌పుర్‌లోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వైద్య కళాళాలలో జరిగింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రోగి పట్ల ఆసుపత్రి సిబ్బంది వైఖరిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనకు సంబంధించి ముగ్గురుని సస్పెండ్ చేసినట్లు కళాశాల డీన్ డాక్టర్ నవనీత్ సక్సేనా తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Last Updated : Jun 30, 2019, 9:14 AM IST