Viral Video: పోలీసులతో యువకుల ఫైటింగ్ - పోలీసులపై కొబ్బరిమట్టతో దాడి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12272749-thumbnail-3x2-police.jpg)
పోలీసులపై కొబ్బరిమట్టతో దాడి చేసి వీరంగం చేశారు కొందరు యువకులు. తమిళనాడు డిండిగుల్ వత్తలగుండు చెక్పోస్ట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు యువకులు తొలుత బారికేడ్లను తమ వాహనంతో ఢీకొట్టారు. పోలీసులు తమను ప్రశ్నించగా వారితో ఘర్షణకు దిగారు. ఈ వివాదం కాస్త ముదిరి.. పరస్పరం దాడి చేసుకునేంతవరకు వెళ్లింది. ఆరుగురు యువకులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.