రైలు కదులుతుంటే హఠాత్తున జారిపడ్డ మహిళ.. - మహారాష్ట్ర వార్తలు తాజా
🎬 Watch Now: Feature Video
కదులుతున్న రైలు ఎక్కబోయిన ఓ మహిళ.. ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. అక్కడే ఉన్న ఓ ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ అప్రమత్తమై.. మహిళను రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి లాగింది. దీంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది ఆ మహిళ. మహారాష్ట్ర ముంబయిలోని స్టాండ్హర్స్ట్ రోడ్ రైల్వే స్టేషన్లో గురువారం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.