Viral: బైక్​పై వచ్చి తుపాకీతో హల్​చల్​ - వ్యాపారిపై కాల్పులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 15, 2021, 11:21 AM IST

పట్టపగలు అందరూ చూస్తుండగా కొంతమంది దుండగులు ఓ వ్యాపారిపై కాల్పులకు పాల్పడిన ఘటన రాజస్థాన్‌లో వెలుగులోకి వచ్చింది. కోటా గుమన్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కూరగాయల మార్కెట్‌లో ఈ ఘటన జరిగింది. బైక్‌ మీద దుకాణం వద్దకు వచ్చిన ముగ్గురు దుండగులు.. ఒక్కసారిగా కాల్పులకు దిగారు. అయితే.. అదృష్టవశాత్తు దుకాణం యజమాని కాల్పుల నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీలో నమోదు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.