రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం- కాపాడిన పోలీసు - రైలు కింద పడి ఆత్మహత్య
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్రలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు కాపాడారు. ఫిబ్రవరి 24న పాల్ఘర్‌లోని విరార్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్లాట్‌ఫాం వద్దకు రైలు వచ్చే సమయంలో ఓ వ్యక్తి హఠాత్తుగా వచ్చి పట్టాలపై పడుకున్నాడు. అవతలి ఫ్లాట్‌ఫాం వద్ద ఉన్న రైల్వే పోలీసు ఈ విషయం గుర్తించాడు. పరుగెత్తుకు వచ్చి అతడ్ని పట్టాలపై నుంచి పక్కకు లాగాడు. దీంతో స్టేషన్‌లోని వారంతా ఊపిరిపీల్చుకున్నారు.