నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే చైన్ స్నాచింగ్ - bengaluru
🎬 Watch Now: Feature Video
గొలుసు దొంగలు మళ్లీ పడగ విప్పుతున్నారు. కర్ణాటక రాయచూర్‌లోని సదర్ బజార్లో ఇద్దరు మహిళలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. జనాలు బాగానే సంచరిస్తున్నారు. అయినా.. ఆ దొంగలకు అడ్డేమీ అనిపించలేదు. పక్కా స్కెచ్ వేసి.. కాచుకొని ఉన్నారు. ఒక్కసారిగా బైక్‌పై దూసుకెళ్లి.. లలిత అనే గృహిణి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. షాక్‌కు గురైన మహిళ కిందపడింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు నమోదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
Last Updated : Sep 27, 2019, 3:40 PM IST