దట్టమైన అడవుల్లో గర్భిణిని 4 కి.మీ మోస్తూ... - Odisha pregnant woman
🎬 Watch Now: Feature Video
ఒడిశా కెందూఝర్ ప్రాంతంలో సరైన రోడ్డు సదుపాయాలు లేక అనేక అవస్థలు పడుతున్నారు అక్కడి ప్రజలు. హాల్దీపాణి సమీపంలోని ఓ ఊరికి సరైన రోడ్డు మార్గం లేక.. నిండు చూలాలును కర్రల సాయంతో 4 కిలోమీటర్లు మోసుకెళ్లాల్సి వచ్చింది. మనిషి నడవటమే కష్టమైన అటవీ మార్గంలో ఓ గర్భిణిని ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఇలా చేశారు. అనంతరం.. ప్రధాన రహదారిపై ఉన్న అంబులెన్స్ ద్వారా ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.