నేటి నుంచి కేదార్నాథ్ ఆలయ దర్శనం - కేదార్నాథ్
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్లో కొలువైన నాలుగు పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం 6 నెలల అనంతరం తెరుచుకుంది. చార్ధామ్ యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రి తరువాత భక్తులు దర్శించుకనే మూడో ఆలయం ఇదే. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూల మాలలతో సుందరంగా అలంకరించారు. వేల మంది యాత్రికుల సమక్షంలో ఆలయ ద్వారాన్ని తెరిచారు పూజారులు. బద్రీనాథ్ ఆలయ తలుపులు ఈ నెల 10న తెరుచుకుంటాయి. బద్రీనాథ్ సందర్శనతో చార్ధామ్ యాత్ర ముగించుకుంటారు భక్తులు.
Last Updated : May 9, 2019, 10:52 AM IST