ఔరా: జాతీయ జెండా ఎగరవేసిన చిలుక - జెండాను ఎగరవేసిన చిలుక
🎬 Watch Now: Feature Video
స్వాతంత్ర్య దినోత్సవం నాడు కర్ణాటకలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఓ చిలుక త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి అందరినీ అబ్బురపరిచింది. మైసూర్‌లోని షుకవానాకు చెందిన శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో చిలుక చేత జెండాను ఎగరవేయించారు. చివరిలో గణపతి సచ్చిదానంద శ్రీ చెప్పినట్లు 'భారత్ మాతాకీ జై' అంటూ చిలక పలికింది. చిలుకలన్నీ ఎంతో క్రమశిక్షణతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.