మేఘన్ మార్కెల్ భారత్లో ఏం చేశారో తెలుసా? - MEGHAN MARKLE
🎬 Watch Now: Feature Video
బ్రిటన్ యువరాజు హ్యారీ సతీమణి మేఘన్ మార్కెల్.. 2017లో భారత పర్యటనకు వచ్చినప్పటి దృశ్యాలు విడుదల చేశారు. యువతుల్లో ఆరోగ్యం, పరిశుభ్రత, రుతుక్రమంపై అవగాహన కల్పించేందుకు 'వరల్డ్ విజన్' స్వచ్ఛంద సంస్థ ప్రపంచ రాయబారిగా భారత్ వచ్చారు. దిల్లీలోని ఓ బాలికల పాఠశాలను సందర్శించారు. విద్యార్థినులతో కలిసి మొక్కలు నాటారు, గోడలపై చిత్రాలు వేశారు. మహిళల పరిశుభ్రత ఉత్పత్తుల ప్రాజెక్టును సందర్శించి వాటిని నిర్వహిస్తోన్న మహిళలతో సమావేశమయ్యారు.