ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. కార్మికుడి సాహసం! - సునార్ నది
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై చిక్కుకున్న ఓ కార్మికుడిని తాళ్ల సహాయంతో రక్షించారు సహచరులు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సాగర్‌లోని సునార్ నదీ ఉప్పొంగి ప్రహహిస్తోంది. దీంతో రాత్రికి రాత్రే నది మట్టం పెరిగింది. అయితే బుధవారం బ్రిడ్జి పనుల్లో ఉన్న ఓ కార్మికుడు రాత్రికి అక్కడే పిల్లర్‌పై పడుకున్నాడు. పొద్దున్నే నదీ ప్రవాహానికి బయటపడలేని స్థితిలో ఉన్న అతడిని తాళ్లు కట్టి, కాపాడారు తోటి కార్మికులు.