thumbnail

By

Published : Jun 28, 2021, 7:28 PM IST

ETV Bharat / Videos

Live Video: బైక్​లో దూరిన పాముపై కర్కశత్వం

పాము తమ దారికి అడ్డంగా వచ్చినందున దాన్ని విచక్షణారహితంగా కొట్టిచంపారు కొందరు యువకులు. ఈ ఘటన మహారాష్ట్ర జలగావ్​ జిల్లాలో జరిగింది. రోడ్డుపై నలుగురు యువకులు ఒకే బైక్​పై వెళ్తుండగా... పొదల్లో నుంచి దూసుకువచ్చిన ఓ పాము.. వాహనంలోకి దూరింది. దాంతో ఆ నలుగురు కిందపడ్డారు. ఆ పాము విషపూరితమైనది కాదని తెలిసి.. అందులో ఓ వ్యక్తి దాని తోక పట్టుకొని రోడ్డుపై బాదాడు. అలా మూడు నాలుగు సార్లు కొట్టగా ఆ పాము ప్రాణాలు విడిచింది. ఆ సమయంలో మిగతా యువకులు నవ్వుతూ ఉన్నారు. ఈ ఘటనపై మూగజీవాల ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.