Live Video: పెళ్లిలో ధూమ్​ధామ్​గా డాన్స్ చేస్తూ.. క్షణాల్లోనే మృత్యుఒడికి!

By

Published : Jan 23, 2022, 2:37 PM IST

thumbnail
Youth Died While Dancing: అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. అప్పటివరకు ఉత్సాహంగా ఆడిపాడిన యువకుడు.. రెప్పపాటులో మృత్యుఒడికి వెళ్లిపోయాడు. ఈ అనూహ్య విషాదం మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లాలోని దోరి గ్రామంలో జరిగింది. వివాహ వేడుకలో అంతలాల్ అనే యువకుడు డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. గుండెపోటుతో క్షణాల్లోనే మృతిచెందాడు. కానీ బంధువులు, స్నేహితులు మాత్రం అంతలాల్​ ఆట పట్టిస్తున్నాడేమో అనుకున్నారు. ఎంతసేపటికీ ఉలుకూపలుకూ లేకపోవడం వల్ల సమీప ఆస్పత్రికి తరలించారు. హార్ట్ఎటాక్​తో అంతలాల్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.