ETV Bharat / state

గుడి మల్కాపూర్​ పూల మార్కెట్​లో ఫుల్​ రష్ - 'క్యాష్'​ చేసుకుంటున్న వ్యాపారులు - Rush At Gudimalkapur Flower Market

Rush At Gudimalkapur Flower Market : పండుగ ఏదైనా, పబ్బం ఎవరిదైనా పువ్వులు కొనుగోలు చేయాలంటే ఠక్కున గుర్తొచ్చేది గుడిమల్కాపుర్‌ పూలమార్కెట్‌. బతుకమ్మ, దసరా పండుగల వేళ మార్కెట్​లో కొనుగోళ్లతో రద్దీ నెలకొంది.

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Public Rush At Gudimalkapur Flower Market
Public Rush At Gudimalkapur Flower Market (ETV Bharat)

Public Rush At Gudimalkapur Flower Market : గుడిమల్కాపూర్ పేరు వింటేనే అందరికీ గుర్తుకు వచ్చేది పూల మార్కెట్​. పండుగలు, శుభకార్యాల్లో అవసరమయ్యే పూలకు ఈ మార్కెట్ కేరాఫ్ అడ్రస్​గా మారింది. దసరా పండుగ సమీపించడంతో కొనుగోలుదారులతో మార్కెట్ రద్దీగా దర్శనమిస్తోంది. మార్కెట్​లో కనీస సౌకర్యాలు కల్పించాలని యార్డు కమిటీని కోరుతున్నారు.

దసరా సందర్భంగా రద్దీగా పూల మార్కెట్​లు : గుడిమల్కాపూర్ పూలమార్కెట్‌కు పండుగ కళ వచ్చింది. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు తరలివస్తున్నారు. బంతి, చామంతి, గులాబీ వంటి పూలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. నగరానికి వెలుపల ఉన్న ఈ మార్కెట్‌ సాధారణ రోజుల్లోనే కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతుంది. అయితే బతుకమ్మ, దసరా పండుగలతో మరింత రద్దీగా మారింది.హైదరాబాద్‌లోని సన్నకారు పూల వ్యాపారులు ఏ పండుగ వచ్చినా, గుడి మల్కాపూర్‌ మార్కెట్‌లోనే కొని నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. బయట మార్కెట్‌తో పోలిస్తే ఇక్కడ తక్కువ ధరలకే పూలు దొరుకుతున్నాయని కొనుగోలుదారులు అంటున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న పూలు : గుడి మల్కాపూర్‌లో విక్రయించే పూలను ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పూలను దిగుమతి చేసుకుంటుండటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో కనీస సదుపాయాల కల్పనలో యార్డు కమిటీ విఫలమైందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"ఈ మార్కెట్​కు వస్తే తక్కువ ధరకే పూలు కొనవచ్చనుకుంటే ఇక్కడ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర ఒక్కో రేటు ఉంటుంది. ఇష్టానుసారంగా అధిక ధరలకు అమ్ముతున్నారు. ఇలాంటి సమయంలో పేదవాళ్లు పండుగ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటోంది. మార్కెట్​ యార్డు కమిటీ చర్యలు తీసుకుని పూలకు ఒక రేటు నిర్ణయించి అమ్మితే బాగుంటుంది"- కొనుగోలుదారుడు

'ఇతర రాష్ట్రాల నుంచి పూలు రావడం వల్ల స్థానికంగా సాగు చేస్తున్న బంతికి డిమాండ్ ఉండటం లేదు. దీనివల్ల మేము నష్టపోతున్నాం. పూలరేట్లు కూడా తక్కువగా ఉన్నాయి. మాకు ఎటువంటి ట్రాన్స్​పోర్టు సదుపాయం కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం' అని పూలను స్థానికంగా విక్రయించడానికి వచ్చిన వారు చెబుతున్నారు.

దసరా సందర్భంగా రద్దీగా మారిన నగర మార్కెట్లు..

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో భారీగా రద్దీ - అడుగు తీసి అడుగు వేసే ఖాళీ లేదు - Secunderabad railway station rush

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.