ETV Bharat / entertainment

'భారతీయుడు' టీమ్ షాకింగ్ డెసిషన్​! - నిజంగానే అలా చేస్తుందా? - Bharateeyudu 3 OTT - BHARATEEYUDU 3 OTT

Bharateeyudu 3 OTT : 'భారతీయుడు 2' థియేటర్లలో డిజాస్టర్ అయిన నేపథ్యంలో 'భారతీయుడు 3' గురించి షాకింగ్ డెసిషన్ తీసుకుంది మూవీ టీమ్. ఏంటంటే?

source ANI and ETV Bharat
Bharateeyudu 3 OTT (source ANI and ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2024, 3:25 PM IST

Bharateeyudu 3 OTT : యూనివర్సల్ స్టార్ కమల్‌ హాసన్‌, డైరెక్టర్​ శంకర్‌ కాంబోలో తెరకెక్కిన చిత్రం 'భారతీయుడు 2' ఇటీవలే థియేటర్లలో భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ ఈ చిత్రానికి సీక్వెల్‌గా భారతీయుడు 3 రానున్నట్లు థియేటర్లలోనే ప్రకటించింది మూవీ టీమ్. అయితే తాజాగా ఈ మూడో భాగం గురించి ఓ వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.

అదేంటంటే? - భారతీయుడు 2 షూటింగ్​తో పాటే భారతీయుడు 3ను కూడా షూట్ చేసినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. సెకండ్ పార్ట్ విడుదలైన ఆరు నెలలకు మూడో భాగాన్ని విడుదల చేయాలని మూవీ టీమ్ భావించిందట. కానీ భారీ అంచనాలతో విడుదలైన భారతీయుడు 2 ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో భారతీయుడు 3 రిలీజ్​పై సందిగ్ధత నెలకొంది.

ఈ క్రమంలోనే తాజాగా 'భారతీయుడు 3'ను నేరుగా ఓటీటీలోకి వదలాలని చిత్ర బృందం భావిస్తోందట. దీని కోసం ఈ చిత్రం నిర్మాణ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరుపుతోందని సమాచారం అందింది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్​మెంట్​ రానుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకైతే నిర్మాణ సంస్థ గానీ నెట్‌ఫ్లిక్స్‌ గానీ స్పందించలేదు. కానీ మరోవైపు మరికొన్ని వెబ్​సైట్లు ఇందులో నిజం లేదని కూడా చెబుతున్నాయి. సినిమా డైరెక్ట్​గా థియేటర్లలోనే విడుదల అవుతుందని అంటున్నారు.

కాగా, 1996లో భారతీయుడు చిత్రం రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. దర్శకుడు శంకర్ దీన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత చాలా సినిమాలను తెరకెక్కించి హిట్ అందుకున్నారు. అయితే ఈ మధ్యలో ఆయనకు సరైన హిట్ పడలేదు. ఈ క్రమంలోనే భారతీయుడు 2తో పాటు గేమ్​ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు శంకర్.

ఇందులో భాగంగా భారతీయుడు 2, 3ని తెరకెక్కించారు. ముందుగా భారతీయుడు 2ను భారీ అంచనాలతో విడుదల చేశారు. ఇందులో సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, వివేక్‌, ప్రియా భవానీశంకర్‌, బ్రహ్మానందం, సముద్రఖని వంటి వారు నటించారు. స‌మాజంలోని అవినీతి, అన్యాయాల్ని రూపుమాపడానికి భారతదేశానికి తిరిగొచ్చిన సేనాపతి ఏం చేశాడు? అతడికి ఎదురైన సంఘటనలు ఏంటి? అనే కథనంతో రూపొదించారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఇందులో కొత్తదనం ఏమీ లేదంటూ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. చూడాలి మరి ఇక రామ్​ చరణ్ గేమ్ ఛేంజర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో.

బాక్సాఫీస్‌కి పండగ కళ - నెలలో పదికిపైగా సినిమాలు - ప్రేక్షకులకు ఫుల్ వినోదం - Telugu Movies Releases Dasara

'గేమ్ ఛేంజర్' సాలిడ్ అప్డేట్ - టీజర్ రిలీజ్ డేట్ చెప్పేసిన తమన్ - Game Changer Teaser

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.