BSNL Anniversary Offers: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన 4జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్‌లను పరిచయం చేస్తోంది. ఇటీవలే తక్కువ ధరకు ఎక్కువ వ్యాలిడిటీతో ప్లాన్‌ను పరిచయం చేయగా తాజాగా తన కస్టమర్లకు అదిరే ఆఫర్‌ను తీసుకొచ్చింది. సంస్థను స్థాపించి 24 సంవత్సరాలు పూర్తికానుంది. ఈ నెలలో బీఎస్‌ఎన్‌ఎల్ 25వ ఏడాదిలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తన వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఉచితంగా 24 జీబీ డేటా ఇవ్వనున్నట్లు తెలిపింది.
24 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న సందర్భంగా కస్టమర్లకు ఫ్రీ డేటా అందిస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ద్వారా వెల్లడించింది. బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న ఈ ఆఫర్ పొందాలంటే రూ.500 కంటే ఎక్కువ విలువైన వోచర్‌తో రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రూ.500లకు పైన రీఛార్జి చేసుకున్న వారందరికీ 24జీబీ ఉచిత డేటా ఇస్తోంది. ఇప్పటికే ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. అయితే అక్టోబర్ 24లోపు రీఛార్జి చేసుకున్నవాళ్లు మాత్రమే ఈ ప్రయోజనాలు పొందుతారు.
ప్రైవేట్ టెలికాం కంపెనీలన్నీ ఇటీవల రీఛార్జి రేట్లను పెంచిన విషయం తెలిసిందే. ఫలితంగా చాలామంది యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జి ప్లాన్లపై దృష్టి సారించారు. దీన్ని అవకాశంగా చేసుకొని బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. 2000 సెప్టెంబర్ 15న బీఎస్‌ఎన్‌ఎల్ స్థాపించారు. అదే ఏడాది అక్టోబర్ 1 నుంచి దిల్లీ, ముంబయి మినహా దేశీయంగా టెలికాం సేవల్ని అందుబాటులోకి తెచ్చింది.
ధర తక్కువ.. వ్యాలిడిటీ ఎక్కువ: ప్రైవేట్ టెలికాం సంస్థలన్నీ రీఛార్జ్ రేట్లను పెంచేస్తున్న వేళ బీఎస్‌ఎన్‌ఎల్ ఇటీవలే తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. తక్కువ ధర రీఛార్జితో ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో బీఎస్‌ఎన్‌ఎల్ తన కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 60 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చిన ఈ సరికొత్త రీఛార్జి ప్లాన్‌తో బీఎస్ఎన్ఎల్కు కస్టమర్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ప్యాక్‌పై మరింత సమాచారం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
శాంసంగ్ యూజర్స్‌కు బిగ్ షాక్- ఏఐ ఫీచర్లు ఏడాదే ఫ్రీ- ఆ తర్వాత వడ్డింపులే! - Samsung AI Features
వాట్సాప్‌లో అదిరిపోయే నయా ఫీచర్- ఇకపై మీ వీడియో కాల్స్ మరింత అందగా! - whatsapp announces new feature