thumbnail

By

Published : Feb 4, 2021, 8:52 AM IST

Updated : Feb 4, 2021, 9:06 AM IST

ETV Bharat / Videos

కళ్లకు గంతలతో పజిల్​ పూర్తి..13 ఏళ్లకే రికార్డులు

రంగు రంగుల గళ్లు.. ఆరు ముఖాలున్న ఓ చిన్ని చతురస్రం.. చేతిలో పట్టుకుని ఎంత తిప్పినా ఒక వైపు మాత్రమే ఒకరంగులోకి మారుతుంది.. మిగిలిన ముఖాలు ఓ మానాన ఒక్కరంగులోకి మారవు. మరి, ఆ రూబిక్ క్యూబ్ పజిల్ పూర్తి చేయడమంటే మాములు విషయమా చెప్పండి! కానీ.. మధ్యప్రదేశ్​లోని ఇందోర్​కు చెందిన తనిష్కా సుజిత్​ మాత్రం అలవోకగా పజిల్​ పూర్తి చేసేస్తోంది. అది కూడా ఆశ్చర్యకరంగా కళ్లకు గంతలు కట్టుకుని.! అంతేకాదండోయ్​.. ఈ చిన్నారి కళ్లకు గంతలతోనే అక్షరాలను ఇట్టే పసిగట్టేస్తూ వేగంగా చదివేస్తోంది కూడా. 11 ఏళ్లకే పదో తరగతి, 12 ఏళ్లకే 12వ తరగతి పరీక్షలు రాసి భళా అనిపించిన ఈ బాలిక.. ఇండియా బుక్​ ఆఫ్ వరల్డ్​ రికార్డ్స్​, ఆసియా బుక్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించి.. ప్రస్తుతం విశ్వ విద్యాలయ విద్యనభ్యసిస్తోంది.
Last Updated : Feb 4, 2021, 9:06 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.