సెలూన్‌లోకి అనుకోని అతిథి- గంటసేపు మేకప్! - దుకాణంలో కోతి ఫన్నీ వీడియోలు
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్ ఛింద్వాడా జిల్లా సియోనిలోని ఓ సెలూన్ షాపులోకి కోతి ప్రవేశించింది. వానరం రాకతో కస్టమర్లు అంతా దుకాణం నుంచి బయటకు పరుగెత్తారు. దుకాణంలోని వస్తువులను చిందరవందరగా విసిరేసిన ఆ కోతి... అద్దంలో తన అందాన్ని చూసి మురిసిపోయింది. సుమారు గంటసేపు ఉన్న ఈ కోతి చేష్టలను చూసేందుకు స్థానికులు గుమిగూడారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది కోతిని బంధించి స్థానిక అడవిలో వదిలిపెట్టారు.