పోలీసుల ముందే లాయర్ల డిష్యుం డిష్యుం - తమిళనాడు న్యూస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 18, 2021, 9:52 AM IST

తమిళనాడు చెన్నై సమీపంలోని కొట్టూర్​లో పోలీసుల ముందే న్యాయవాదులు పిడిగుద్దులు కురిపించుకున్నారు. వారు నివసించే కాలనీ రోడ్డు నిర్మాణ పనిలో తగాదా పడ్డారు. కొట్టూర్​లోని నాయుడు కాలనీ రోడ్డు నిర్మాణ పనుల్లో లాయర్ పద్మనాభన్​, థామస్​ శ్రీనివాసన్ మధ్య వివాదం మొదలైంది. రోడ్డు నిర్మిస్తే తన ఇంటిలోకి వరద నీరు వస్తుందని పద్మనాభన్ ఆరోపించారు. ఈ వివాదంపై ఇద్దరు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇటీవల వర్షం కారణంగా రోడ్డు మీద వరద నీరు వచ్చి చేరింది. దీంతో రోడ్డు నిర్మాణాన్ని కాలనీవాసులతో కలిసి మొదలుపెట్టాడు శ్రీనివాసన్​. అక్కడే గొడవకు దిగిన ఇరువర్గాలు.. కేసు నమోదు చేయడానికి పోలీస్ స్టేషన్​కు వెళ్లాయి. అక్కడ పోలీసుల ముందే బాహాబాహీకి దిగాయి. వీరి ఫైటింగ్​ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.