పని చేస్తుండగా మ్యాన్​హోల్​లో పడిన కార్మికుడు - వారణాసిలో మ్యాన్​హోల్​లో పడిన కార్మికుడు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 29, 2021, 7:44 PM IST

మ్యాన్​హోల్​లో పనిచేసేందుకు దిగిన ఓ కార్మికుడు పొరపాటున 30 అడుగుల లోతున చిక్కుకుపోయాడు(Labour stucks in manhole). ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ వారణాసి జిల్లాలోని(Varansi labour trapped in manhole) లహురా​బీర్​ ప్రాంతంలో జరిగింది. మ్యాన్​హోల్​లో పడిన వ్యక్తిని బంగాల్​కు చెందిన 20 ఏళ్ల నవాబ్​గా గుర్తించారు. నవాబ్​ను బయటకు తీసేందుకు ఎన్​డీఆర్​ఎఫ్​, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ప్రయత్నిస్తున్నారు. లోపల నీటి ఒత్తిడి అధికంగా ఉండడం కారణంగా సహాయక చర్యలు కష్టతరంగా మారాయని ఎన్​డీఆర్ఎఫ్​ డిప్యూటీ కమాండెంట్​ అసిమ్​ ఉపాధ్యాయ్​ తెలిపారు. ఘటనాస్థలికి ప్రజలు భారీగా చేరుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.