కోణార్క్ ఆలయంలో ఉద్రిక్తత.. గోడలు దూకి లోపలికి..
🎬 Watch Now: Feature Video
Konark Temple Tourists: యునెస్కో గుర్తింపు పొందిన ఒడిశాలోని కోణార్క్ సూర్యదేవాలయంలో మంగళవారం కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆలయాన్ని వీక్షించేందుకు పర్యటకులు అధిక సంఖ్యలో వచ్చారు. అదే సమయంలో సాంకేతిక కారణాలతో ఆన్లైన్ బుకింగ్‌కు అంతరాయం ఏర్పడింది. ఆలయ యాజమాన్యం వద్ద 3 వేల టోకెన్లు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడున్న చాలామంది పర్యటకులు గోడలు దూకి ఆలయంలోకి ప్రవేశించారు. ఎట్టకేలకు స్థానిక పోలీసులు.. పర్యటకులకు నచ్చజెప్పడం వల్ల పరిస్థితి సద్దుమణిగింది.