చిన్నారి మాటకు మురిసిన రాహుల్ గాంధీ - JINDABAD
🎬 Watch Now: Feature Video
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అరుదైన అనుభవం ఎదురైంది. కేరళ కోజికోడ్ పర్యటనలో భాగంగా తనను కలిసేందుకు పలువురు మద్దతుదారులు వచ్చారు. వారితో వచ్చిన ఓ చిన్నారిని ఎత్తుకున్నారు రాహుల్. ఆ చిన్నారి ఒక్కసారిగా 'రాహుల్ గాంధీ జిందాబాద్' అని అరిచింది. మురిసిపోయిన రాహుల్ చిన్నారి బుగ్గపై ముద్దుపెట్టారు. నవ్వుతూ పాపను తల్లిదండ్రులకు అప్పగించారు రాహుల్.