Live Video: ఆటోతో ఢీకొట్టి.. కత్తులతో నరికి.. వ్యక్తి దారుణ హత్య
🎬 Watch Now: Feature Video
కర్ణాటక బెంగళూరు నగర శివారు ప్రాంతంలో రౌడీషీటర్‌ను దారుణంగా హత్య చేశారు ఆరుగురు దుండగులు. రామమూర్తి నగర్‌లోని తన ఇంటి నుంచి బైక్‌పై వెళ్తున్న కుల్ల వెంకటేశ్‌ను ఆటోతో ఢీకొట్టి.. ఆ తర్వాత కత్తులతో నరికి చంపారు. అనంతరం ఆటో, బైక్‌పై పారిపోయారు. ఈ దృశ్యాలన్నీ స్థానిక సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు అనిల్ సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. భూవివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.