కర్ణాటక శాసనమండలిలో బాహాబాహీ - కర్ణాటక శాసనమండలి
🎬 Watch Now: Feature Video
కర్ణాటక శాసనమండలిలో సభ్యులు బాహాబాహీకి దిగారు. సభ నిర్వహిస్తున్న.. మండలి ఉపసభాపతి ధర్మగౌడను కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆయన స్థానం నుంచి కిందకు బలవంతంగా లాక్కొచ్చారు. ఆ స్థానంలో మండలి ఛైర్మన్ ప్రతాప్ చంద్ర షెట్టిని కూర్చోబెట్టారు. ఈ క్రమంలో భాజపా- కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ధర్మగౌడ.. జేడీఎస్ పార్టీకి చెందిన వారు కాగా భాజపా- జేడీఎస్ కలిసి ధర్మగౌడను బలవంతంగా ఆ కుర్చీలో కూర్చోబెట్టడం వల్లే తాము ఇలా చేయాల్సి వచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు చెబుతున్నారు.
Last Updated : Dec 15, 2020, 1:25 PM IST