'సామాజిక దూరం కాదు భౌతిక దూరం పాటించాలి!' - బళ్లారి విమ్స్ డా అనిశ్ సలహాలు
🎬 Watch Now: Feature Video
దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోన్న తరుణంలో కర్ణాటక బళ్లారి విజయనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) కు చెందిన డాక్టర్ అనిశ్ ప్రజలకు తగు సూచనలు చేశారు. మహమ్మారి వ్యాక్సిన్ లేనందున ముందస్తు జాగ్రతలు, నివారణ చర్యల ద్వారా మహమ్మారిని నియంత్రించవచ్చని అన్నారు. ప్రాణాంతర వైరస్ విషయంలో ప్రజలను భయపడవద్దని సూచించారు. సామాజిక దూరం కాదని.. భౌతిక దూరాన్ని తూ.చ. తప్పకుండా పాటించాలని వ్యాఖ్యానించారు.