చావు అంచులకు వెళ్లి.. షాకింగ్ వీడియో... - రైలు ప్రమాదం
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్రలో ఓ ప్రయాణికుడు ఘోర రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ముంబయిలోని బోరివలీ రైల్వేస్టేషన్లో కదులుతున్న గోల్డెన్ టెంపుల్ ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు శుక్రవారం అతడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి ప్లాట్ఫాం, రైలుకు మధ్య పడిపోయాడు. వేగంగా వెళుతున్న రైలు అతడిని గుద్దుతూ వెళ్లగా గింగిరాలు కొట్టాడు. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వినీత్ కుమార్ వెంటనే స్పందించి.. ప్రయాణికుడిని వెనక్కు లాగారు. దీంతో అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.