రైలు ఎక్కబోయి కిందపడ్డ వృద్ధుడు- కాపాడిన పోలీసు - old man has been protected by rpf jawan
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10440066-744-10440066-1612017143928.jpg)
రైలు ఎక్కబోయి కిందపడిన 79ఏళ్ల ప్రయాణికుడిని ఆర్పీఎఫ్ పోలీసు రక్షించిన వీడియో వైరల్ అవుతోంది. ముంబయిలోని కల్యాణ్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిందీ ఘటన. దిల్లీకి చెందిన మసూర్ బఫూర్ అహ్మద్.. కల్యాణ్ స్టేషన్‌లో పంజాబ్ మెయిల్ ఎక్కడానికి ప్రయత్నించే క్రమంలో ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫాం-రైలు మధ్య చిక్కుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన ఎస్పీ యాదవ్, జితేంద్ర గుజార్ అనే ఆర్‌పీఎఫ్ పోలీసు మసూర్‌ను పైకి లాగి ప్రాణాలను కాపాడారు. ప్రాణాలకు తెగించి తనను కాపాడినందుకు ఆ వృద్ధుడు ఆర్‌పీఎఫ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.