వరద నీటిలో కొట్టుకొచ్చిన ఎల్పీజీ సిలిండర్లు - cylinders floating in haryana
🎬 Watch Now: Feature Video

మోకాళ్ల లోతు వరద నీటిలో పదుల సంఖ్యలో ఎల్పీజీ సిలిండర్లు తేలుతూ కనిపించడం కలకలం రేపింది. హరియాణాలోని సిర్సా జిల్లా చౌతాలా గ్రామంలో ఈ దృశ్యం కనిపించింది. భారీ వర్షాలకు వరద నీరంతా గ్రామంలోని రోడ్లపైకి చేరుకుంది. ఈ నీటిలో కనిపించిన సిలిండర్లను సంబంధిత వ్యక్తులు.. వ్యాన్లలోకి ఎక్కిస్తున్నారు. వీటిని తీసుకెళ్లే వాహనం ప్రమాదానికి గురైందా? లేదా మరే విధంగా ఇవి ఇక్కడికి వచ్చాయనే విషయంపై స్పష్టత లేదు. పొరపాటున పేలి ఉంటే తీవ్ర పరిణామాలు తలెత్తేవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Jul 31, 2021, 4:44 PM IST