కూరగాయలు అమ్మే బామ్మ కాళ్లు పట్టుకున్న మంత్రి! - MP Minister Slap News
🎬 Watch Now: Feature Video
Gwalior Woman Slap Minister: మధ్యప్రదేశ్ ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రద్యుమన్ సింగ్ గొప్ప మనసు చాటుకున్నారు. గ్వాలియర్‌లో కూరగాయలు అమ్ముకుని జీవించే బామ్మ కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరారు. రోడ్డుపై రద్దీకి కారణమౌతుందని స్థానికంగా ఉండే ఓ కూరగాయల మార్కెట్‌ను మరో ప్రాంతానికి తరలిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో మార్కెట్‌ను సందర్శించిన మంత్రిని చూసి.. బాబినా భాయ్ అనే వృద్ధురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలు అమ్ముకుని బతికే తన ఉపాధిని దూరం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో బామ్మను శాంతింపజేసిన మంత్రి పరిస్థితిని వివరించారు. ఈ అసౌకర్యానికి క్షమించమని కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. బామ్మ చేతులను పట్టుకుని చెంపలపై కొట్టించుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.