పూలు అమ్మినచోటే కట్టెలు అమ్ముతున్న నేత - INX MEDIA CASE
🎬 Watch Now: Feature Video
2011 జూన్ 30... అప్పుడు ఆయన కేంద్ర హోంమంత్రి. దిల్లీలో నిర్మించిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కార్యాలయం ప్రారంభోత్సవంలో దర్జాగా పాల్గొన్నారు. సీబీఐ అధికారుల చేత సలాం కొట్టించుకున్నారు. ఆయనే కాంగ్రెస్ నేత పి.చిదంబరం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అదే సీబీఐ అధికారుల చేతిలో అరెస్టు అయ్యారు. మరీ దారుణంగా తను ఏ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరయ్యారో అక్కడే ఇప్పుడు బందీగా ఉన్నారు. ఇదే కదా విధి విలాసమంటే. వింత నాటకం.
Last Updated : Sep 27, 2019, 8:42 PM IST