వరద బీభత్సం-నడుము లోతు నీటిలో అంతిమయాత్ర - మధ్యప్రదేశ్ గుణ జిల్లా వార్తలు
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ కారణంగా గుణ జిల్లాలోని అనేక ప్రాంతాలు వరదలో చిక్కుకుపోయాయి. బదౌరా గ్రామంలో మరణించిన వృద్ధుని అంత్యక్రియలు జరిపేందుకు ఓ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. మూడు నుంచి నాలుగు అడుగుల మేర నీటితో నిండిన దారిగుండా ప్రయాణించి అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.