స్వీట్ షాప్లో అగ్నిప్రమాదం- టపాసుల్లా పేలిన సిలిండర్లు - సిలిండర్ బ్లాస్ట్ మధ్యప్రదేశ్
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్ ఛతర్పుర్లోని ఓ మిఠాయి దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటల ధాటికి షాపులోని ఐదు సిలిండర్లు వరుసగా పేలిపోయాయి. దీంతో మంటలు మరింతగా వ్యాపించాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగనప్పటికీ.. భారీగా ఆస్తినష్టం సంభవించింది. స్వీట్ షాపుతో పాటు పైఅంతస్తులో ఉన్న డెంటల్ క్లినిక్ పూర్తిగా దగ్ధమైంది. స్వీట్ షాప్ సమీపంలో ఉన్న మున్సిపల్ కార్యాలయ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఇంజిన్లు రానందున.. స్థానికులే బకెట్ల ద్వారా నీటిని చల్లి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు.