కదిలే రైల్లోనే అదిరే 'ఖాదీ' ఫ్యాషన్ షో - Mahametro Nagpu
🎬 Watch Now: Feature Video
ఫ్యాషన్ షో అనగానే ఓ చక్కటి వేదికను ఏర్పాటుచేసి అట్టహాసంగా నిర్వహిస్తారు. అయితే.. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో ఇందుకు భిన్నంగా నడుస్తున్న మెట్రో రైలు వేదికైంది. అదీ మామూలు దుస్తులతో కాదండోయ్.. ఖాదీ వస్త్రాల ప్రదర్శనతో వినూత్నంగా ఏర్పాటుచేశారు నిర్వహకులు. 'మిస్టర్ అండ్ మిసెస్ ఖాదీ-2020' పేరిట నిర్వహించిన ఈ ఖాదీ వాక్‌లో 35 మంది మోడల్స్ సంప్రదాయ దుస్తులతో ఆకట్టుకున్నారు.