రైతులతో కలిసి కబడ్డీ ఆడిన రాకేశ్ టికాయిత్ - ఉత్తర్ప్రదేశ్ గాజీపుర్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్(Rakesh Tikait) దిల్లీకి సమీపంలో గాజీపుర్ సరిహద్దులో రైతులతో కలిసి కబడ్డీ ఆడారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గాజీపుర్ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు.. ప్రతి సాయంత్రం వివిధ క్రీడలు ఆడుతున్నారు. ఇందులో భాగంగా రాకేశ్ టికాయిత్ రైతులతో కలిసి కబడ్డీ ఆడారు. 'కబడ్డీ ఆడుతూ ప్రభుత్వంతో కబడ్డీ ఆడేందుకు తాము సిద్ధమవుతున్నాము' అని ఆయన అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.