జనావాసాల్లోకి వచ్చిన ఏనుగు.. గ్రామస్థులపై దాడి - కమోలా గ్రామంలోకి ప్రవేశించిన గజరాజు
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్‌లోని కాలాధుంగి ప్రాంతంలో ఓ ఏనుగు జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టించింది. కమోలా గ్రామంలోకి ప్రవేశించిన గజరాజు స్థానికులపై దాడి చేస్తూ వారిని భయాందోళనకు గురిచేసింది. గ్రామస్థులంతా పెద్ద శబ్దాలు చేయడం వల్ల సమీపంలోని చెరకు తోటలోకి ఏనుగు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. గతంలోనూ చాలాసార్లు ఏనుగు తమ గ్రామంలోకి వచ్చినట్లు చెప్పారు. ఏ క్షణంలో గజరాజులు దాడి చేస్తాయో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామంటూ వాపోయారు. అటవీశాఖ అధికారులకు ఎన్ని సార్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు.