'మమతపై దాడి' సీసీటీవీ ఫుటేజ్ విడుదల! - నందిగ్రామ్ ఘటన సీసీటీవీ ఫుటేజ్ విడుదల
🎬 Watch Now: Feature Video
బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాలికి గాయమైన నందిగ్రామ్ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేసింది ఎన్నికల సంఘం. కారు వద్ద జనం గుమిగూడినట్లు వీడియోలో కనిపిస్తోంది. బుధవారం నందిగ్రామ్ పర్యటనలో భాగంగా తన కారు డోరు వద్ద నిలబడగా కొందరు వ్యక్తులు తోసేయవడం వల్లే ఈ ఘటన జరిగిందని దీదీ ఆరోపించారు. ఇది కుట్రపూరిత వ్యూహమే అని టీఎంసీ నేతలు సైతం ఆరోపిస్తున్నారు. దీన్ని భాజపా తోసిపుచ్చింది.