తాగిన మత్తులో 150 అడుగుల టవర్ పైనుంచి జంప్ - young man sucide
🎬 Watch Now: Feature Video
తాగిన మైకంలో ఓ యువకుడు 150 అడుగుల టవర్ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఛత్తీస్‌గఢ్‌లోని పామ్‌గఢ్ ప్రాంతంలో బుధవారం జరిగిందీ ఘటన. ఓల్డ్ టౌన్షిప్లో నివాసముండే ప్రకాశ్(22) డబ్బులు కావాలని డిమాండ్ చేస్తూ.. టవర్‌పైకి ఎక్కాడు. గమనించిన స్థానికులు అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతడిని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా.. అప్పటికే బాగా మద్యం సేవించి ఉన్న ప్రకాశ్ దూకేశాడు. ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.