వీడియో వైరల్: గణనాథుడికి శునకం నమస్కారం! - Pune dog squad updates
🎬 Watch Now: Feature Video
వినాయకచవితి వేళ మహారాష్ట్రలోని ఓ దేవాలయంలో గణేశుడికి నమస్కారం చేసి స్వామి భక్తిని చాటుకుందో శునకం. పుణెలోని ప్రసిద్ధ దగ్దుశేత్ హాల్వాయ్ దేవాలయంలో గణపతి పూజ జరుగుతుండగా.. భద్రత కోసం పోలీసులను మోహరించారు అధికారులు. అందులో భాగంగా నియమించిన డాగ్స్క్వాడ్లోని ఓ కుక్క వినాయకుడికి నమస్కరించింది. కెమెరాలో నిక్షిప్తమైన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.