సావన్ మాసం ఆరంభం- శైవ క్షేత్రాలు కిటకిట - రద్దీ
🎬 Watch Now: Feature Video
సావన్ మాసం తొలి సోమవారం సందర్భంగా ఉత్తరభారతంలోని శైవ క్షేత్రాలు కిక్కిరిశాయి. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు శివుడిని దర్శించుకుంటున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలో ఘాట్లన్నీ కళకళలాడుతున్నాయి. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. కొంత మంది కన్వారాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ల చిత్రాలు ముద్రించి ఉన్న టీ షర్టులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో యోగీ పాలన సంతృప్తికరంగా ఉన్నందునే ఈ విధంగా చేసినట్టు వివరించారు.