మౌనీ అమావాస్య రోజున వారణాసికి పోటెత్తిన భక్తులు - mouni amavasya news
🎬 Watch Now: Feature Video
మౌనీ అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానాల కోసం వారణాసిలోని గంగానదికి భక్తులు పోటెత్తారు. గంగాఘాట్ వద్ద పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. సంక్రాంతి పర్వదినం తరువాత వచ్చే పుష్యమాస అమావాస్యను మౌనీ అమావాస్య అంటారు. ఈ రోజున పితృతర్పణాలు, నదీ స్నానాలు, మౌన వ్రతం పాటించడం పుణ్యప్రదమన్నది శాస్త్రోక్తి. సాధువులు, యోగులు ఈ రోజున మౌనంగా ఉంటారు. జ్ఞానాన్ని నిద్రలేపే చర్యగా భావించి, మాటలు అవసరం లేదని యోగులు భావిస్తారు.
Last Updated : Feb 18, 2020, 5:09 AM IST