జనతా కర్ఫ్యూ పాటించని యువకులు.. గుంజిళ్లు తీయించిన పోలీసులు - Maharastra news
🎬 Watch Now: Feature Video
భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 'జనతాకర్ఫ్యూ'నకు మద్దతిస్తూ స్వచ్ఛంద గృహనిర్బంధంలో ఉన్నారు ప్రజలు. ఆదివారం దేశమంతా నిర్మానుష్యంగా ఉన్న వేళ.. మహారాష్ట్ర పుణెలో ముగ్గురు యువకులు బయటతిరుగుతూ పోలీసుల కంట్లో పడ్డారు. తమకు కర్ఫ్యూ సంగతి తెలియదని బుకాయించారు. బాధ్యత మరచి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు యువకులను రోడ్డుపైనే గుంజిళ్లు తీయించారు పోలీసులు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.