చెన్నైలో మళ్లీ వర్ష బీభత్సం- ఇబ్బందుల మధ్యే న్యూఇయర్‌కు స్వాగతం! - తమిళనాడు సీఎం
🎬 Watch Now: Feature Video
Chennai Rains: తమిళనాడును మళ్లీ భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వానలతో.. ప్రజలు అల్లాడిపోతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు చోట్ల రోడ్లపై నీరు చేరింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. రాష్ట్రానికి మరో ఐదు రోజులు వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. చెన్నై, కాంచీపురం, తిరువల్లూర్, చెంగల్పట్టు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి.. సహాయక చర్యలకు ఉపక్రమించారు.