'కరోనా' ప్రమాదకరమైన వైరస్ కాదు: సీసీఎమ్‌బీ డైరెక్టర్
🎬 Watch Now: Feature Video
భారత్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 200కుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై వైరస్ నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. ప్రజలు కూడా స్వీయ నిర్బంధం పాటిస్తూ జాగ్రత్త వహిస్తున్నారు. ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలు ముందు జాగ్రత్త చర్యలే ఈ వైరస్‌కు విరుగుడు అని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలందరూ క్రమశిక్షణతో ప్రభుత్వాల సూచనలు పాటించాలని పిలుపునిస్తోంది సీసీఎమ్‌బీ. కరోనా ప్రమాదకరమైన వైరస్ కాదని అప్రమత్తంగా ఉంటే వ్యాప్తిని సులువుగా అడ్డుకోవచ్చని చెబుతున్న సీసీఎమ్‌బీ డైరెక్టర్ రాకేశ్ కె. మిశ్రాతో ముఖాముఖి.